బాలీవుడ్, టాలీవుడ్,కోలీవుడ్ అనే బేధాలు లేకుండా ఎప్పటికప్పుడు సినీ ఇండస్ట్రీలోకి కొత్త హీరో, హీరోయిన్లు పుట్టుకొస్తుంటారు.అయితే అందులో కొంతమందికి  అదృష్టం వరిస్తుంది. మరికొంత మందికి దురదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలోని గొప్ప గొప్ప వారి ఇళ్ళల్లో అంత సామాన్యంగా ఏ విషయము బయటకు రాదు. కొద్దో గొప్పో బయటకు వస్తోంది అంటే అది సోషల్ మీడియా పుణ్యమే. సోషల్ మీడియా ద్వారా అన్ని విషయాలు బయటకు నొక్కవు  ఏదో కొన్ని విషయాలు మాత్రమే బయటికి వస్తాయి.

ఇలాంటి త్రోవలోనే "ఇష్టం "సినిమా హీరో చరణ్ రెడ్డి కూడా. చరణ్ రెడ్డి మరెవరో కాదు అక్కినేని ఫ్యామిలీ అక్కినేని నాగేశ్వర రావు గారి మనవరాలు సుప్రియ భర్త. సుప్రియ కూడా పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అయినా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.చరణ్ రెడ్డిది  నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెం.

చరణ్  రెడ్డి మొదటిసారిగా 2001వ సంవత్సరంలో రామోజీరావు నిర్మాతగా ఉషా కిరణ్ ప్రొడక్షన్స్ లో నిర్మించిన చిత్రం "ఇష్టం".అంతేకాకుండా హీరోయిన్ శ్రీయ శరణ్ కథానాయికగా, దర్శకుడు విక్రమ్ కె.కుమార్ కూడా ఈ సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యారు.ఈ సినిమా పెద్ద హిట్ అవ్వలేదు. ఆ తరువాత సుమన్ చెల్లెలు నాగేశ్వరరావు గారి మనవరాలు సుప్రియ ను పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు.

ఇక సుప్రియ కూడా సినిమాలకు దూరమై అన్నపూర్ణ ప్రొడక్షన్స్ చూసుకోవడం మొదలుపెట్టింది.ఇక చరణ్ రెడ్డి పెళ్లి అయిన కొద్ది సంవత్సరాలకే మరణించడం అందరిలోనూ తీరని లోటు కలిగించింది. అయితే చరణ్ రెడ్డి మరణించడానికి సంవత్సరం ముందే సుప్రియ తో విడాకులు కోరుతూ కోర్టులో ఫిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే చరణ్ రెడ్డి గుండెపోటుతో మరణించాడని సోషల్ మీడియాలో కొద్దిరోజులు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఉస్మానియా హాస్పిటల్ లో ఆయన చనిపోయిన తరువాత పోస్టుమార్టం లో చరణ్ రెడ్డి బాగా త్రాగడం వల్ల లివర్ చెడిపో ఇవ్వడంతో పాటు ఆయనకున్న టెన్షన్స్ వల్లే హార్ట్ ఎటాక్ వచ్చిందని తేలింది. అయితే చరణ్ రెడ్డి సినిమాలలో రాణించలేదని బాధ ఒకవైపు,  భార్యతో విడాకులు కోరానన్న బాధ ఇంకోవైపు ఏదో తీవ్రమైన డిప్రెషన్కు గురై త్రాగుడుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే చరణ్ రెడ్డి ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయాడు.

అయితే చరణ్ రెడ్డి తో సహా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రేయ శరణ్ మాత్రం స్టార్ హీరోలు అయినా నాగార్జున,చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది. శ్రేయ శరణ్ తన నటనతో, అందంతో, అభినయంతో ప్రేక్షకుల మదిలో ఒక గొప్ప గొప్ప గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: