బాలీవుడ్ సీనియర్ నటుడు మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న అమీర్ ఖాన్ ముద్దుల తనయ ఇరా ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈమె ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. తాజాగా తను ఓ వ్యక్తితో ప్రేమలో పడినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా ఇరా ఖాన్  మిషాల్ క్రిపాలని అనే వ్యక్తితో కలిసి చెట్టపట్టాలు వేసిన ఈ అమ్మడు ప్రస్తుతం అతనికి గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఈమె ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ప్రేమయానం నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి ప్రేమ విషయం గురించి పలుసార్లు బాలీవుడ్ మీడియా కూడా తెలియజేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు పలువురు వీరిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే
ఇరా ఖాన్ వీరందరి సందేహాలను తీరుస్తూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టారు.

తాజాగా ఇరా ఖాన్,నుపుర్ శిఖారేతోకలిసి దిగిన ఫోటోను ఈమె సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ఈ విషయం మీకు తెలియజేయడం గౌరవం అని పేర్కొన్నారు. తాజాగా ఈమె చేసిన పోస్ట్ పై పలువురు సినీ ప్రముఖలు తమదైన శైలిలో ఎమ్మోజీల ద్వారా కామెంట్ లు చేశారు. దాదాపు కొన్ని నెలల నుంచి వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను చూస్తే ప్రజలు వీరు ప్రేమలో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.అయితే ప్రస్తుతం ఇరాక్ ఖాన్ ఈ పోస్టు ద్వారా అందరి అనుమానం నిజమైందని, ఇప్పటికైనా ఈమె ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకుంటారా అంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.ఈ ఫోటో చూసిన మరికొంత మంది నెటిజన్లు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ  కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇరా ఖాన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: