పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. అవన్నీ పవన్ కళ్యాణ్ మొదట్లో చేసిన సినిమాలే కావడం విశేషం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత గోకులంలో సీత ఇలా అనేక సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. అప్పుడు భీమినేని  శ్రీనివాస్ రావు దర్శకత్వం లో వచ్చిన చిత్రం 'సుస్వాగతం'. ఈ చిత్రంలో తండ్రీ-కొడుకుల మధ్య ఉన్న సెంటిమెంట్ సన్నివేశాలు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవడంతో సుస్వాగతం అనే చిత్రం  పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

ఇక ఇందులో తండ్రి పాత్రలో చేసిన రఘువరన్ స్తానంలో ముందు నటభూషణ్ 'శోభన్ బాబు' ని  అనుకున్నారట. సినిమా అంతా తండ్రీకొడుకుల మధ్య సాగే సన్నివేశాలు ఉండడంతో ఆ తండ్రి పాత్ర కోసం ఒక పవర్ ఫుల్  కథానాయకుడిని ఎంచుకోవాలని చిత్రబృందం మొదట అనుకున్నారు. ఆలా అప్పుడు చిత్ర నిర్మాత అయిన ఆర్బి చౌదరి శోభన్ బాబుని కలవడం మరియు పాత్ర గురించి చెప్పడం జరిగాయని కానీ, అప్పటికి అయన సినిమాలకి రిటైర్మెంట్ ప్రకటించగా మళ్ళీ మేకప్ వేసుకోకూడదనే బలమైన నిర్ణయం తీసుకోవడంతో శోభన్ఆ బాబు  ఆ తండ్రి పాత్రకి నో చెప్పారు.

ఆలా శోభన్ బాబు నో చెప్పడంతో అతని స్థానంలోకి విలన్  పాత్రలతో మెప్పించిన రఘువరన్ ను తీసుకొచ్చి నటింపజేశారు. ఒక విధంగా శోభన్ బాబు మరియు పవన్ కళ్యాణ్ ని పక్కపక్కన ఒకే తెర పై చూసే అదృష్టం మనకి దక్కలేదనే చెప్పాలి. లేదంటే వారిద్దరూ కలిసి ఆ సినిమా చేసుంటే ఏ రేంజ్ లో హిట్ అయ్యేదో ఒక్కసారి ఉహించుకోండి.ఆ కాంబినేషన్ జరగకపోయినా, పవన్ కళ్యాణ్- రఘువరన్ కాంబినేషన్ చాలా అద్భుతంగా కుదరగా    ఆ సినిమా విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఇప్పటికి ఎవరైనా 'సుస్వాగతం' సినిమాని చూస్తే వారి నటనకు తప్పకుండ కన్నీళ్లు పెట్టుకోకుండా మాత్రం ఉండలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: