సినీ ఇండస్ట్రీలో నాటి నుంచి నేటి వరకు హీరోయిన్లుగా తమ హవాను కొనసాగిస్తున్న వారిలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అయితే వీరు సినీ ఇండస్ట్రీలోకి బాలనటులుగా అడుగు పెట్టి , కెమెరా ముందు తమ ప్రతిభను చూపించి,ఆ తర్వాత హీరోయిన్లుగా స్టార్ పొజిషన్ ను అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో ఎవరెవరు బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి , ప్రస్తుతం స్టార్స్ గా  కొనసాగుతున్నారో వారిపై ఒక లుక్కేద్దాం..


1. అవికా గోర్:సూపర్ హిట్ సీరియల్ "బాలికా వధు"హిందీ సీరియల్ లో బాలనటిగా నటించి , బాగా పాపులారిటీ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ..తెలుగులో కూడా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా మంచి ఫేమ్ ను అందుకుంది. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ సరసన ఎన్నో చిత్రాలలో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.


2. హన్సిక:స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన దేశముదురు సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హన్సిక, సినిమాలలోకి రాకముందు ఎన్నో షోలలో, సీరియల్స్ లో,సినిమాలలో బాల నటిగా నటించి బాగా పాపులారిటీని అందుకుంది.

3. శ్వేత బసు ప్రసాద్:వరుణ్ సందేశ్ సరసన కొత్త బంగారులోకం సినిమాలో నటించి, ఎకడా.. అనే డైలాగ్ తో బాగా పాపులారిటీ అందుకున్న ఈ భామ, బాలనటిగా పలు సినిమాలలో నటించింది. అగ్ని సినిమాలో బాలనటిగా నటించిన తీరుకు  జాతీయ అవార్డు కూడా లభించింది.

4. షామిలీ:జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో తన అక్క షాలిని తో పాటు కలసి నటించిన ఈ చిన్నారి, అంజలి సినిమాలో నటించిన నటనకు గాను ఉత్తమ బాల నటిగా అవార్డు కూడా అందుకుంది. సిద్ధార్థ్ సరసన ఓయ్ చిత్రంలో హీరోయిన్ గా నటించి అందరినీ ఆకట్టుకుంది.

5. షాలిని :చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు నలభై సినిమాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ,  సఖి సినిమాలో  హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇక ఆ తరువాత  తమిళ్ లో  దాదాపు పది చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

6. శ్రీదివ్య:అర్జున్, జగపతి బాబు కలిసి సంయుక్తంగా నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాలో  చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, ఆ తర్వాత మనసారా చిత్రం ద్వారా హీరోయిన్ గ నటించింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

7. కీర్తి సురేష్:మహానటి ద్వారా బాగా పాపులారిటీ అందుకున్న  కీర్తి సురేష్ ప్రముఖ నిర్మాత సురేష్ కుమార్ , నటి  మేనకల కూతురు. కీర్తి సురేష్ తన తల్లి ప్రోత్సాహంతో చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ,నేను శైలజ చిత్రం ద్వారా హీరోయిన్ గా అందరి మనసులను గెలుచుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: