ఎవ‌రైనా ఎక్కడో ఒక‌ప్పుడు ఎవ‌రో చెప్పిన విష‌యాన్ని లేదా వారిచ్చిన ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. అలా నేడు మెగాస్టార్‌గా మ‌న ముందుకు వ‌చ్చిన చిరంజీవి కూడా ఒక‌రి ద్వారానే వెండితెర‌పైకి రావ‌డానికి వీలప‌డింద‌ని స్వ‌యంగా చిరంజీవి ఓ సంద‌ర్భంలో వివ‌రించారు. సహాయ నటుడిగా సినీకెరీర్ ప్రారంభించి.. ప్రతినాయక పాత్రల్లో మెరిసి.. ఆ పై హీరోగా టాలీవుడ్‌పై మెగాస్టార్‌లా కొలువుదీరిన చిరంజీవి జీవిత ప్రయాణం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగానే ఉంటుంది. ఎన్నో ఒడిదొడుకుల ఎదుర్కొని తెలుగు సినిమాను శాసించే స్థాయికి ఎదిగిన ఆ న‌ట‌స్వ‌రూపం ఎంద‌రో సినిమా వైపు అడుగులు వేసేలా చేసింది. అసలు చిరులోని న‌టుడిని మొద‌ట‌గా గుర్తించింది ఎవరో తెలుసా?


 
  త‌న‌ను సినిమా వైపు న‌డిపించిన వ్య‌క్తి గురించి చిరంజీవి ఓ సంద‌ర్భంలో వివ‌రించారు.  చిరు తండ్రి చీరాలలో ఎస్సైగా పనిచేస్తున్న రోజుల్లో అదే స్టేషన్‌లో ప‌నిచేస్తున్న‌ ఓ కానిస్టేబుల్ తాను చెప్పే సినిమా డైలాగ్స్‌, చేసే యాక్షన్‌ మూమెంట్స్‌ను చాలా ఇష్టపడేవార‌ట‌, అలాగే త‌ను న‌టించిన తీరుపై  ప్రశంసలు కురిపించే వారని చిరు తెలిపారు.



 కానీ, ఆ కానిస్టేబుల్‌ మాటల్నెప్పుడూ అంత సీరియస్‌గా తీసుకునే కోలేద‌ని, ఓ రోజు ఆయన చిరంజీవి దగ్గరకొచ్చి ‘బాబు మిమ్మల్ని చూస్తుంటే అచ్చు బాలీవుడ్‌ హీరో శత్రుఘ్నసిన్హా లాగే ఉన్నార‌ని, ఆయనలాగే చేస్తున్నార‌ని చెప్పి, మీరు అర్జెంటుగా సినిమా ఫీల్డ్‌కు వెళ్లిపోండి’  అని స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. ఆరోజు ఆయన అన్న మాటలు త‌న పై చాలా ప్రభావం చూపించాయ‌ని,  ఆయన అక్కడితో ఆగకుండా చిరంజీవిని అప్పటికప్పుడు స్టూడియోకు తీసుకెళ్లి ఫొటోలు తీయించి మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపింర‌ని చెప్పారు. వాటి వల్లే తాను అడయార్‌ ఫిలిమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు దక్కించుకున్నాని గుర్తు చేసుకున్నారు.

     అలా ఓ సామాన్య కానిస్టేబుల్ త‌న‌ నింపిన స్ఫూర్తితోనే ఈ రోజున మెగాస్టార్‌గా నిల‌బ‌డ‌గ‌లిగాన‌ని చిరు చెప్పాడు.  అయితే  ఆ కానిస్టేబుల్‌ మరెవరో కాదు.. చీరాల పక్కనే ఉన్న పేరాలకు చెందిన కానిస్టేబుల్‌ వీరయ్య”  అని చెప్ప‌కొచ్చారు.  ప్ర‌స్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే.


 ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ కూడా ఓ పాత్ర‌ను పోషిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం విడుద‌ల అయిన మోష‌న్ పోస్టర్‌, పాట మంచి రెస్పాన్స్‌ను పొందాయి. ఆ త‌రువాత మ‌ళ‌యాల సినిమా లూసీఫ‌ర్‌ను చిరంజీవి రీమేక్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టుల‌ను కూడా ఎంపిక చేశారు. దీనికి తెలుగులో టైటిల్‌ను కూడా ఇటీవ‌ల ఫిక్స్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: