హాట్ బ్యూటీ రాశి కన్నా బాలీవుడ్  సినిమా 'మద్రాసి కేఫ్' తో వెండితెరకు పరిచయమై , ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగా నాగ సౌర్య హీరోగా, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రాశి ఖన్నా నటనకు, అందచందాలకు, హావభావాలకు తెలుగు ప్రజల నుండి మంచి మార్కులు పడటంతో వరుస ఆఫర్లు ఈ ముద్దుగుమ్మని వెతుక్కుంటూ వచ్చాయి. అందులో భాగంగానే తెలుగులో  లవకుశ, బెంగాల్ టైగర్, సుప్రీమ్, జిల్, శివమ్, టచ్ చేసి చూడు, వెంకీ మామ, హైపర్, వరల్డ్ ఫేమస్ లవర్, వంటి పలు చిత్రాలలో నటించి తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా రాశి కన్నా ఎదిగింది. అయితే ఈ హాట్ బ్యూటీ సినిమాలతో ఎంత బిజీగా సమయం గడుపుతున్నా సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటుంది.తను రోజు చేసే పనులను , షూటింగ్ విశేషాలను మరియు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను  సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో, గోపీచంద్ హీరోగా నటిస్తున్న 'పక్కా కమర్షియల్'  అనే సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'పక్కా కమర్షియల్' సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ షూటింగ్ గ్యాప్ లో కొంత సమయం దొరకడం తో ఒక కునుకు తీసాను అని తెలియజేసింది. అంతేకాకుండా నిద్రలో వెకేషన్ కు వెళ్లినట్టు కల కూడా వచ్చింది అంటూ రాశి ఖన్నా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: