ప్రస్తుతం అన్ని భాషలలో రీమేక్ సినిమాల జోరు బాగానే నడుస్తుంది, ఏదైనా ఒక భాషలో ఒక సినిమా మంచి విజయం సాధించింది అంటే ,ఆ సినిమా ను మరో భాషలో రీమేక్ చేయడానికి దర్శక నిర్మాత లు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అయితే ఇలా తెలుగులో సూపర్ హిట్ సాధించిన సినిమా లను అనేక భాష లలో రీమేక్ చేసి మంచి విజయాలను అందుకున్న హీరో లు కూడా ఉన్నారు ,అలా తెలుగు లో విజయ్ దేవరకొండ హీరో గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో శాలిని పాండే హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా అర్జున్ రెడ్డి , ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే , ఇదే సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో  షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరు తో బాలీవుడ్ లో తెరకెక్కించారు, ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సాధించింది.

అయితే  తెలుగు సినిమా రీమేక్ తో మంచి విజయాన్ని అందుకున్న షాహిద్ కపూర్ ప్రస్తుతం మరో తెలుగు సూపర్ హిట్ సినిమా  జెర్సీ ను కూడా బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు తెలుగు జెర్సీ సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాను 31 డిసెంబర్ 2021 నా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించారు. ఇదే విషయాన్ని జెర్సీ సినిమా హీరో షాహిద్ కపూర్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు, మరి  షాహిద్  కపూర్ మరోసారి తెలుగు రీమేక్ తో బాలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: