టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి నమ్రత మహేష్ ల వివాహ బంధానికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వీరిద్దరూ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిద్దరూ తమ వ్యక్తిగత వైవాహక జీవితానికి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసారు. వాస్తవానికి వీరిద్దరూ 2005 లో పెళ్ళి చేసుకున్నప్పటికీ అంతకుముందు 5 సంవత్సరాల క్రితం నుండి వీరిద్దరూ ప్రేమించుకుంటూ వచ్చారు.


వాస్తవానికి సూపర్ స్టార్ కృష్ణ వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించకపోయినా చాల సహనంతో కృష్ణ అంగీకారం వచ్చేదాకా ప్రయత్నాలు చేసి ఆతరువాత పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకున్నారు. తాము పెళ్ళి చేసుకున్నప్పటి నుండి జరిగిన ఆసక్తికర విషయాలను నమ్రత ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తాను హీరోయిన్ అన్న విషయాన్ని మర్చిపోయి ఒక గృహిణిగా మారడానికి తాను ఎక్కువగా సమయాన్ని తీసుకోలేదని దీనితో తమమధ్య ఎలాంటి ఇగోల సమస్యలు ఎప్పుడు రాలేదు అని చెప్పింది.


అంతేకాదు గౌతమ్ సితార లను పెంచి పెద్ద చేయడంలో తాను చాల కష్టపడినప్పటికీ  ఆ కష్టంలో తనకు ఎంతో ఆనందం కలిగింది అంటూ కామెంట్స్ చేసింది. ఇక మహేష్ గురించి మాట్లాడుతూ బయటకు చాల స్వీట్ గా కనిపించే మహేష్ చాల సున్నిత మనస్కుడు అని చెపుతూ ఎప్పుడు మహేష్ కు కోపం వచ్చే విధంగా తాను ఎలాంటి పనులు చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది.

ఇదే సందర్భంలో తమ మొదటి పరిచయం గురించి మాట్లాడుతూ ‘వంశీ’ షూటింగ్ కోసం తాను హైదరాబాద్ వచ్చినప్పుడు సెట్ పై చాల ముభావంగా కనిపించిన మహేష్ ను చూసి మొదట్లో తాను చాల భయపడ్డానని అలాంటి వ్యక్తి తనకు ప్రేమికుడుగా మారి ఆతరువాత అతడు తన భర్త అవుతాడని అనుకోలేదు అంటోంది. ఇక తన నటనకు సంబంధించి కొన్ని అవకాశాలు వచ్చినా మళ్ళీ తనకు నటించాలని లేదని మహేష్ భార్య హోదాను తాను ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్ చేసింది.ఈ ఇంటర్వ్యూకు సంబంధించి వీరిద్దరూ ఇచ్చిన స్పెషల్ ఫోటో షూట్ ఫోటోలు మీడియాలో వైరల్ గా మారాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: