ఒకప్పుడు సినీ సెలబ్రిటీలకు అభిమానులకు మధ్య ఎంతో దూరం ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆ దూరం కేవలం ఒక గీత దగ్గర ఆగిపోయింది అనే చెప్పాలి. ఆ గీతే సోషల్ మీడియా. ఒకప్పుడు సినీ సెలబ్రెటీలను చూస్తే చాలు అనుకునే వారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా సోషల్ మీడియా పుణ్యమా అని నేరుగా సోషల్ మీడియా వేదికగా సిని సెలబ్రెటీలతో మాట్లాడే  అవకాశం వస్తుంది. ఇటీవల కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమ అభిమానులతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ముచ్చటించడం లాంటివి చేస్తున్నారు.



 ఇలా చాలామంది సెలబ్రిటీలు అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటించడం అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలా కొంతమంది సిని సెలబ్రెటీలను మంచి ప్రశ్నలు అడిగితే మరికొంతమంది మాత్రం చిత్రవిచిత్రమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా కొంతమంది సినీ సెలబ్రిటీల కు సోషల్ మీడియా వేదికగా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇక ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల గ్యాప్ తీసుకున్న శృతిహాసన్ మళ్ళీ ఇటీవలే క్రాక్ అనే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ ట్రాక్ లో పడింది.



 ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తన సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా తన నిజ జీవితానికి గమనిక విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవలే తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించింది శృతిహాసన్. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఊహించని ప్రశ్న అడిగాడు. దీంతో దిమ్మ తిరిగి రిప్లై ఇచ్చింది శృతిహాసన్. అభిమానులతో చాట్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఫోన్ నెంబర్ ఇవ్వాలి అంటూ శ్రుతి హాసన్ ను అడిగాడు. ఇక దీనికి సమాధానం ఇచ్చిన శృతిహాసన్ 100 అంటూ పోలీసులు నెంబర్ ఇచ్చి షాక్ ఇచ్చింది. దీంతో ఇక నెంబర్ అడిగిన నెటిజన్ కు దిమ్మతిరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: