సినిమా హీరోయిన్స్ ఒక స్టేజ్ వరకు సినిమాల్లో నటించి ఆ తర్వాత వారు తమ తమ పర్సనల్ లైఫ్ లోకి వెళుతూ ఉంటారు. యుక్త వయసులో ఉన్నప్పుడు హీరోయిన్లుగా వచ్చి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సూత్రాన్ని పాటించి ఫాంలో ఉన్నప్పుడే మంచి రెమ్యునరేషన్ తీసుకొని జీవితంలో సెటిల్ అయిపోతారు. ఆ విధంగా వారు డబ్బు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తర్వాత ఓ వయసు రాగానే పెళ్ళిళ్ళు చేసుకుంటారు.

అలా ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్ లు ఎంతోమంది బిజినెస్మెన్ లను కొంతమంది సినిమా వారిని పెళ్లి చేసుకుని జీవితంలో ఆనందంగా గడుపుతున్నారు. అలా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఆమె చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె తాజాగా సినిమాలు ఒప్పుకోవడం మానేసింది.  దాంతో ఆమె ఆమె అభిమానులు ఆమె ప్రెగ్నెన్సీ దాదాపుగా నిజమేనని అనుకుంటున్నారు. ఇంకోవైపు మరికొన్ని నెలల్లోనే ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటాను అని కాజల్ తన సన్నిహితులతో చెబుతోందట.

అలాగే హీరోయిన్ శ్రియ కూడా ప్రెగ్నెంట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. 2000 సంవత్సరంలో ఇష్టం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీయ రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళ హిందీ కన్నడ భాషల్లో సైతం ఆమె నటించి అక్కడ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. అయితే ఆమె హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రను పోషిస్తుండగా ఆమె ప్రెగ్నెంట్ అని వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి వీరిద్దరూ ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని ఎప్పుడు చెబుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: