మొన్నటివరకు తెలుగు చిత్రపరిశ్రమ మొత్తాన్ని ఊపేసింది  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి..  ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా చల్లారడం లేదు.  ఇంకా టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన రగడ జరుగుతూనే ఉంది.  దీంతో సినీ ప్రేక్షకులు అందరూ సినీ సెలబ్రిటీల తీరును చూసి అవాక్కయ్యే పరిస్థితి వచ్చింది. సినిమా లో నీతి నిజాయితీ అంటూ ఎన్నో భారీ భారీ డైలాగులు చెప్పే సినీ సెలబ్రిటీలు హుందాగా ఉండకుండా ఇలా రోడ్డు మీదికి వచ్చి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం ఎందుకు అన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు.


 అసలు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏం జరుగుతుంది అన్నది అసలు అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే గతంలో ఎన్నికల సమయంలో కూడా ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం జరిగింది.  ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం అందరూ ఒక్కటిగా కలిసి పోయారు. లోలోపల విభేదాలు ఉన్నా బయటకి మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజు ఇక ఏకంగా కొత్త అసోసియేషన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  అదే సమయంలో ఎంతో మంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.



 అయితే గతంలో పోటీ చేసిన వారందరూ ఓడిపోయిన తర్వాత సైలెంట్ గానే ఉన్నారు. కానీ ప్రకాష్ రాజు ఎందుకు ఇంతలా డ్రామాలు చేస్తున్నారు అన్నదే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న టాక్.  ప్రకాష్ రాజు వెంట ఉన్న వారందరూ రాజీనామా చేస్తున్న తరుణంలో.. మరోసారి మా అసోసియేషన్ కాస్త అట్టుడికిపోతోంది.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినప్పుడు ఆ నిర్ణయాన్ని గౌరవించకుండా ఎందుకు సినిమా ఇండస్ట్రీ పరువు తీయడం అంటూ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కన్నడ వాడు అయిన ప్రకాష్ రాజ్ వచ్చి ఏకంగా తెలుగు వాళ్ళ పరువు తీస్తున్నాడని.. రోడ్డుమీదికి లాగుతున్నాడు అంటూ కొంత మంది విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: