చిరంజీవి హీరోగా నటించిన అంజి సినిమా పూర్తిగా గ్రాఫిక్స్ తో నిండిపోయి ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా అటు ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా గ్రాఫిక్స్ తో ప్రేక్షకులు అందరినీ ఆశ్చర్యపరిచింది. వక్ర బుద్ధి వినాశనానికి దారితీస్తుంది అన్న విషయాన్ని ఇక ఈ సినిమాలో చూపించారు. అప్పటికే స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి ఇక ఇలాంటి ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ఉన్న సినిమా తీసి సాహసమే చేశారు అని చెప్పాలి.
ఇక ఈ సినిమా విషయం లో ఎన్నో సార్లు అటు దర్శక నిర్మాతలు భయపడ్డారట. ఈ సినిమా తీసే సమయంలో ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారు అని అనుకున్నారట. అయితే భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అటు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేసినప్పటికీ.. ఇక ఈ సినిమాలో ఉన్న అసలు కాన్సెప్ట్ మాత్రం ప్రేక్షకులకు కాస్త అర్థం కాలేదు అని చెప్పాలి. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చివరికి ఆవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.