తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏదైనా కొత్తదనం పరిచయం చేయాలంటే.. దర్శకుడు రాఘవేంద్ర రావు, హీరో కృష్ణ కే ఇది సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో దాదాపుగా 8 చిత్రాలు వచ్చినప్పటికీ అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాయట. అయితే ఆ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1). అడవి సింహాలు:
రాఘవేంద్ర రావు, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో చిత్రం  అడవి సింహాలు. ఈ సినిమాని ఒకేసారి బాలీవుడ్లో కూడా  విడుదల చేయడం జరిగింది.

2). భలే కృష్ణుడు:
కృష్ణ, రాఘవేంద్ర రావు కలయికలో వచ్చిన మొట్టమొదటి చిత్రం."భలే కృష్ణుడు"ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఘన విజయాన్ని సాధించింది.

3). ఘరానా దొంగ:
రాఘవేంద్ర రావు, కృష్ణ కలయికలో వచ్చిన ద్వితీయ చిత్రం. ఘరానా దొంగ. ఈ సినిమాలో శ్రీదేవి ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా కూడా మంచి హిట్ ను సొంతం చేసుకుంది.

4). ఊరికి మొనగాడు:
ఇద్దరి కలయికలో వచ్చిన మూడవ సినిమా" ఊరికి మొనగాడు". ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

5). శక్తి:
వీరిద్దరి కలయికలో వచ్చిన ఐదవ సినిమా శక్తి. ఈ సినిమాలో కృష్ణ ద్విపాత్రాభినయం లో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ జయసుధ, రాధ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

6). ఇద్దరు దొంగలు:
ఈ సినిమాలో శోభన్ బాబు, కృష్ణ కలిసి నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

7). అగ్నిపర్వతం:
ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే సన్నివేశాలను రాఘవేంద్రరావు బాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో అన్నదమ్ములుగా కృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు.

8). వజ్రాయుధం:
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం వజ్రాయుధం. ఈ సినిమాలో కూడా కథానాయికగా శ్రీదేవి నటించింది.

ఇక రాజకుమారుడు సినిమా కూడా డైరెక్టర్ గా రాఘవేంద్రరావు చేసినప్పటికీ ఈ సినిమాలో అతిథి పాత్రలో కృష్ణ నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: