విజయ్ దేవరకొండ.. నాటకాల ద్వారా తన జీవితాన్ని మొదలుపెట్టిన ఈయన ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో యూత్ స్టార్ గా గుర్తింపు పొందుతున్నాడు.. అంతేకాదు ఇప్పుడు నటిస్తున్న లైగర్ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే, పాన్ ఇండియా హీరో అయిపోతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. విజయ్ దేవరకొండ 1989 మే 9వ తేదీన దేవరకొండ గోవర్ధనరావు, మాధవి దంపతులకు జన్మించారు. వీరు తెలంగాణాలో వున్న నాగర్ కర్నూలు జిల్లా లోని బల్మూరు గ్రామానికి చెందినవారు. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధనరావు కు సినిమాలంటే ఎంతో పిచ్చి.. ఆ కారణంగానే వీళ్ళు హైదరాబాద్ వచ్చి సెటిల్ అవడం జరిగింది.


గోవర్ధనరావు కూడా నటుడు కావాలని అనుకున్నాడు.. కానీ దురదృష్టవశాత్తు ఆయన తన కలను నెరవేర్చుకో లేక పోయాడు. అందుకే బుల్లితెర ఇండస్ట్రీలో దర్శకుడిగా మారి పలు టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాధవి వ్యక్తిత్వ వికాస నిపుణులు.. ఈమె హైదరాబాదులోని ఎంతో మందికి శిక్షణ తరగతులను ఇస్తూ ఉంటుంది.  విజయ్ దేవరకొండ కు ఒక తమ్ముడు కూడా ఉన్న విషయం తెలిసిందే.. అతడు ఆనంద్ దేవరకొండ. ఆనంద్ తన విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత అమెరికాలోని డెలాయిట్ కంపెనీలో కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి, ఆ తర్వాత ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు.


విజయ్ దేవరకొండ అలాగే ఆనంద్ దేవరకొండ ల విద్యాభ్యాసం మొత్తం అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో పూర్తి అయ్యింది. టీవీలు, సెల్ ఫోన్లు లేని ప్రశాంతమైన వాతావరణంలో వీరిద్దరూ గడిపినట్లు.. ఇక వీరి సినీ జీవితానికి పునాది అక్కడే పడినట్లు తెలుపుతున్నారు ఈ అన్నదమ్ములు ఇద్దరు. ఇకపోతే నువ్విలా అనే సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన విజయ్ దేవరకొండ, ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్రలో కనిపించాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమా తో సోలో హీరోగా ఒక సంచలనం సృష్టించాడు.. అంతేకాదు ప్రస్తుతం రౌడీ హీరోగా, యూత్ స్టార్ గా గుర్తింపు పొందుతున్నాడు విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: