నిన్న కర్ణాటక రాష్ట్రానికి ఒక బ్లాక్ డే అని చెప్పాలి. ఎందుకంటే కోట్లాదిమంది అభిమానులను తన నటనతో తన వెన్న లాంటి మనస్సుతో సంపాదించుకున్న ప్రముఖ సినిమా నటుడు పునీత్ రాజ్ కుమార్ నిన్న గుండె పోటుతో మరణించారు. ఈ విషయం తెలిసిన కర్ణాటక ప్రజలు ఉసూరుమంటున్నారు. నిన్నటి నుండి ఎందరో ఆహారం కూడా మాని ఆయన గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఒక మనిషిని ఇంతలా ఆరాధిస్తారు అని పునీత్ అభిమానులను చూస్తేనే అర్ధమవుతోంది. నిన్నటి నుండి ఈయన మరణంపై అనేకమంది తమతో ఉన్న గుర్తులను నెమరువేసుకుంటున్నారు. అదే విధముగా ప్రముఖ కన్నడ మరియు తెలుగు సినిమా డైరెక్టర్ వీర శంకర్ పునీత్ గురించి కొన్ని విషయాలను ఒక ఇంటర్వ్యూలో తెలియచేశారు.

ఇప్పటి కాలంలో ఇంతటి టాలెంట్ ఉన్న నటుడిని మరియు ఇంత గౌరవం చూపించే వారిని చూడలేదని ఒక్క మాటలో చెప్పారు. ఎంతటి వారైనా గౌరవం ఇస్తూ వారితో చాలా ప్రేమగా మాట్లాడుతాడని కితాబిచ్చారు. నేను నా కెరీర్ లో పునీత్ రాజ్ కుమార్ తో కలిసి పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. పునీత్ రాజ్ కుమార్ లేరు అంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ది కావడం లేదు. ఎందుకు ఈ దేవుడు మంచి వాళ్లనే తీసుకెళ్ళిపోతాడని బాధపడ్డాడు.  అయితే వీరి మధ్యన జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాడు.

వీరశంకర్ పునీత్ తో తీసిన "నమ్మ బసవ" కథను వారింట్లోనే పునీత్ తో పాటుగా ఇద్దరి బ్రదర్స్ కు వివరించాను. కథ విన్న తర్వాత వెంటనే శివ రాజ్ కుమార్ నన్ను హాగ్ చేసుకున్నాడు. మంచి కథను తయారు చేశావ్ అంటూ అభినందించాడు. పునీత్ మాత్రం వారి ముందే వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంత పెద్ద స్టార్ ఏంటి డైరెక్టర్ కాళ్ళు పట్టుకోవడమని అది ఆయన నాన్నగారు వారిని పెంచిన విధానం అని తెలిసింది. ఈ విధంగా ఈ సంఘటనను తలుచుకుని వీర శంకర్ బాధపడ్డాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: