క్రియేటివ్ దర్శకుడు సుకుమార్‌ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ తేజ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘రంగస్థలం’ ఎంత పెద్ద సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. 2018 మార్చి 30న రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. చెర్రీ, సమంతల కెరియర్‌లోనే ఈ చిత్రం ఓ మైలురాలుగా నిలిచింది. ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో చెర్రీ నటనకు, రామలక్ష్మి పాత్రలో సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రంగమ్మత్తగా నటించిన అనసూయ స్టార్డం అలా పెరిగిపోయింది. ఇక ఈ చిత్రంలో "జిల్ జిల్ జిగేలు రాణి" ఐటెం సాంగ్ అయితే తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసింది. కమర్షియల్ మూవీ అయినా, పక్కా మాస్ చిత్రమైనా కంటెంట్ ఏదైనా సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటే...ఆ ఎఫెక్టే వేరు.

ఇక అందులోనూ రంగస్థలంలో స్పెషల్ సాంగ్ మరీ స్పెషల్...స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజ హెగ్డే ఈ చిత్రం లో ఐటెం సాంగ్ కు చిందులు వేశారు. అందులోనూ పక్కా లోకల్ అంటే గ్రామీణ యువతిగా ఆమె సాంగ్ లో హావభావాలను పలికించి అందరి మనసులను కొల్లగొట్టింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ హైలెట్ కాగా చెర్రీ పూజ హెగ్డే ల స్టెప్పులు హైలెట్ గా నిలిచాయి. టాలీవుడ్ టాప్ 10 ఐటెం సాంగ్స్ అంటే అందులో ఈ పాట ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతగా అందర్నీ అలరించి మెప్పించింది ఈ పాట.

వెండి తెరపై ఈ పాట వస్తుంటే చూస్తున్న వారు లేచి స్టెప్పులు వేసేలా కంపోజ్ చేశారు టాలెంటెడ్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. గంటా వెంకట లక్ష్మి  ఈ పాటను ఆలపించారు. ఈ సినిమాలో పాటలు అన్నీ సక్సెస్ అయ్యాయి. ఒక సినిమా విజయంలో ఐటెం సాంగ్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడానికి ఇది మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: