ఫ్యామిలీ సినిమాలు అంటే కేవలం సంసారం అంటే ఎలా సాగాలి అనే కాన్సెప్ట్ తో మాత్రమే తెరకెక్కడం కాదు ఫ్యామిలీలు ఎలా ఉంటాయి.. ఎలా తమ జీవితాలను సంతోషంగా కొనసాగిస్తున్నాయి అని చక్కటి సారాంశం తో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలో కామెడీ లేకపోతే ప్రేక్షకులు కూడా చూడడానికి ముందడుగు వేయడం లేదు. ఒక సినిమాలో కేవలం పది నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు మాత్రమే కామెడీ ఉంటే ఎంతో ఉత్సాహంగా చూసే ప్రేక్షకులు, అదే సినిమా మొత్తం కామెడీ అయితే.. ఇక అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా పండగ అని చెప్పవచ్చు.. అలా వచ్చిన సినిమానే ఫ్యామిలీ సర్కస్..


ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో మల్టీ మీడియా బ్యానర్ పై సుంకర మధు మురళి నిర్మించిన ఈ సినిమా 2001 వ సంవత్సరంలో విడుదలై అత్యంత ఘన విజయాన్ని అందుకుంది. జగపతిబాబు, రోజా రాజేంద్రప్రసాద్, కంచి కౌల్ వంటి ప్రముఖులు ఈ సినిమాలో బాగా నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా మొత్తం కామెడీ కావడంతో ఒక మోస్తరుగా ప్రేక్షకులను మెప్పించి కలిగింది.. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు నటన అమోఘం అని చెప్పాలి. సాధారణంగా ఈ మధ్య కాలంలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జగపతిబాబు ఆ కాలంలో ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఆకట్టుకునేవాడు.

జగపతి బాబు నటించిన ఏ సినిమా అయినా సరే ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా యువతకు కూడా బాగా కనెక్ట్ అవుతుంటాయి.ఈ  మధ్యకాలంలో విలన్ గా అవతారమెత్తిన జగపతిబాబు తన సత్తా ఏంటో చాటుతున్నాడు.. ఫ్యామిలీ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఈయన ప్రస్తుతం విలన్ గా,  హీరోలకు పోటీ ఇస్తూ మంచి స్పీడ్ మీద దూసుకుపోతున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాజేంద్రప్రసాద్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పాత్రలు పోషిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: