టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కెరీర్ టెంపర్ సినిమా ముందు తర్వాత అని చెప్పాలి. ఎందుకంటే టెంపర్ సినిమా లో తన నట విశ్వరూపం చూపించిన జూనియర్ ఎన్టీఆర్ ఇక ఆ తర్వాత ప్రతి సినిమాలో కూడా సరికొత్త ప్రయోగం చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఇక జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అరవింద సమేత వీర రాఘవ.ఈ టైటిల్ తోనే సగం మంది ప్రేక్షకులను ఆకర్షించాడు దర్శకుడు త్రివిక్రమ్. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటేకాస్త భిన్నంగానే ఉంటాయి. అంతే కాదు పంచ్ డైలాగులు అందరిని మంత్ర ముగ్దుల్ని చేస్తూ ఉంటాడు దర్శకుడు త్రివిక్రమ్. దానికి ఎన్టీఆర్ నటన తోడైతే ఇక రచ్చ రచ్చ అనే భారీగానే అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.


 ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ అంచనాలను అందుకోవడం కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ప్రేక్షకులను అలరించింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం అయితే తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడూ మరచిపోలేదు అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నాన్నమ్మ జేజి పాత్రలో ఒక కొత్త నటి నటించింది. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఈమె ముఖం చూసి ఉండరు. అయితే ఇలా టెంపర్ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ నాన్నమ్మ గా నటించిన  నటి కొడుకు పెద్ద స్టార్ హీరో అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.



 అంతేకాదు మోస్ట్ టాలెంటెడ్ సపోర్ట్ ఆర్టిస్టుగా కూడా ఎంతో ప్రశంసలు అందుకుంది ఈమె. ఆమె పేరు సుప్రియ పాతక్. గుజరాత్ కి చెందిన ఈమె చిన్నప్పుడు నుంచి నటనపై మక్కువ ఉండడంతో ఎన్నో నాటకాల్లో కూడా నటించే వారు. ఆ తర్వాత సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో అవకాశాలు దక్కించుకుంది. సుప్రియ ఒకప్పుడు మంచి నటుడు అయిన పంకజ్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే సుప్రియ పంకజ్ కపూర్ కి రెండో భార్య కావడం గమనార్హం. అయితే పంకజ్ కపూర్ కొడుకు షాహిద్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. అయితే సుప్రియా పాఠక్ షాహిద్ కపూర్ కి పిన్ని వరస అవుతుంది . తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ సర్కార్ మూవీ తో ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె ఆ తర్వాత అరవింద సమేత అనే సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: