వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా సినిమాలు రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి సమయం దగ్గరపడుతుండడంతో ఆ బడా సినిమాలకు సంబంధించి మేకర్స్ వరుస అప్డేట్లను ఇస్తూ వస్తున్నారు. ఇక ప్రమోషన్స్ ని అందరూ కూడా పాటతోనే ప్రారంభిస్తున్నారు. అయితే ప్రమోషన్స్ విషయంలో మాత్రం మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాస్త ఆలస్యంగా బోణీ కొడుతున్నాడు. ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్'వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్.

 ఈ క్రమంలోనే నవంబర్ 15వ తేదీన రాధే శ్యామ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని చెబుతూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక పోస్టర్ లో సినిమా పేరు కింద తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలు మాత్రమే ఉన్నాయి. ఆ పోస్టర్ లో హిందీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ సినిమాను అసలు హిందీ లో విడుదల చేస్తున్నారా? లేదా? అనే కొత్త సందేహం మొదలైంది అభిమానుల్లో. మొన్నామధ్య అల్లు అర్జున్ పుష్ప విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే పుష్ప చిత్రయూనిట్ మాత్రం అలాంటి డౌట్ వద్దని క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఆ డౌట్లు రాధేశ్యామ్ సినిమాపై పెరిగిపోతున్నాయి. మరి ఆ సందేహాలకు చెక్ పెట్టే బాధ్యత రాధేశ్యామ్ టీమ్ మీద ఉంది. ఈ సినిమా హిందీ వెర్షన్ ఫస్ట్ సింగిల్  ఎందుకు విడుదల చేయడం లేదు అనే విషయాన్ని చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఒకవేళ హిందీ వెర్షన్ సాంగ్ ని తర్వాత రిలీజ్ చేస్తామని అనుకుంటే కనీసం ఆ విషయం అయినా చెప్పాలి. నిజానికి ఈ సినిమా సౌత్, నార్త్ కోసం వేర్వేరు సంగీత దర్శకులను ఎంచుకున్నారు. దక్షిణాది భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఇక హిందీలో మిథున్, అమాల్ మాలిక్,మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ఫస్ట్ సింగిల్ లిరిక్ ని తెలుపుతూ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ పోస్టర్లను విడుదల చేశారు. కానీ హిందీ కోసం పోస్టర్ గాని,లిరిక్ పేరు గాని ఎక్కడా రివిల్ చేయలేదు. దీంతో రాధే శ్యామ్ నుండి హిందీ పాట మాత్రమే రాదా, లేక హిందీ వెర్షన్ సినిమానే రాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీనిపై రాధేశ్యామ్ టీం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: