చిత్ర  పరిశ్రమలో కొంతమంది హీరో హీరోయిన్ ల జంటలు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. హీరోయిన్లు కలిసి నాలుగైదు సినిమాలు వరుసగా నటించారు అంటే చాలు ఇక ఆ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు మొదలవుతాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది హీరో హీరోయిన్ల విషయంలో ఇలాంటి వార్తలు నిజమే అవుతూ ఉంటాయి. ఇలా ఇప్పటి వరకూ పలు సినిమాలలో హీరో హీరోయిన్లుగా  నటించి ఇక ఆ తర్వాత నిజజీవితంలో భార్యాభర్తల్లా గా మారిన వారు ఎంతోమంది ఉన్నారు.


ఇలా మారిన వారిలో విజయనిర్మల సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉన్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ భార్య గా మారక ముందే విజయనిర్మల చిత్ర పరిశ్రమలో ఎంతగానో సాధించారనే చెప్పాలి. ఇక చిత్ర పరిశ్రమకు ఎంతగానో సేవ చేసిన మహిళా మణి గా కూడా గుర్తింపు సాధించారు. 1946 ఫిబ్రవరి 28వ తేదీన తమిళనాడు లో జన్మించారు విజయనిర్మల. ఆమె అసలు పేరు నిర్మల. జయసుధకు పిన్ని అవుతారు విజయనిర్మల. పాండురంగ మహత్యం అనే సినిమాలో బాలనటిగా చిత్ర రంగంలోకి ప్రవేశం చేశారు విజయనిర్మల. ఇక ఆ తర్వాత 11 ఏళ్ల వయసున్న సమయంలోనే చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించిన ఆమె రంగులరాట్నం అనే సినిమాతో హీరోయిన్గా అవతారమెత్తారు.



 సుమారు 200కు పైగా చిత్రాల్లో విజయనిర్మల నటించి తన సత్తా చాటారు.. తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో నటించి ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ లో కొనసాగారు విజయనిర్మల. ఇక ఆ తర్వాత దర్శకురాలిగా మారి  సత్తా చాటారు. సుమారు నలభై నాలుగు చిత్రాలకు దర్శకురాలిగాదర్శకత్వం వహించి ఈ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసారు. ఏకంగా ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళ గా గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించారు విజయనిర్మల. విజయనిర్మల కొడుకు నరేష్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. ఇక చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. విజయనిర్మల మృతితో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి లో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: