దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సినీ నటులు తమ నటనతో  ఓ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి వారు ఏదైనా పాత్రలో నటించారు అంటే ఇక వాళ్ళు తప్ప ఆ పాత్రలో ఇంకెవరూ చేయలేరు అన్నట్టుగా తమ నటనతో ప్రభావితం చేస్తూ ఉంటారు . ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు ఎంతో మంది నటులు.  అలాంటి నటులలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో బాగా గుర్తింపు తెచ్చుకుంది శరత్ కుమార్. హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటి వరకుఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్ధుల్ని చేశాడు శరత్ కుమార్.


 దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు అని చెప్పాలి. అయితే అటు తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు కన్నడ మలయాళం తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. శరత్ కుమార్ ఏదైనా పాత్రలో నటిస్తున్నాడు అంటే చాలు ఆ పాత్ర ఒక రేంజిలో ఉండబోతుంది అని ప్రేక్షకులు అంచనాలు వేసుకుంటూ ఉంటారు. అంతలా తన నటనతో అందరినీ ప్రభావితం చేశాడు శరత్ కుమార్. అయితే ఇటీవల కాలంలో మాత్రం అంతగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇక ఇప్పటికే రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూ కి హాజరైన శరత్ కుమార్ తన పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. తాను మొదట పేపర్ బాయ్ గా పని చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక రానున్న రోజుల్లో మీరు రాజకీయాల్లోకి వెళ్తారా లేదా సినిమాల్లో కొనసాగుతారా అని అడగగా.. సినిమాల్లో ఇంకా ఏదో సాధించాలనే ఉంది. ఇంకా ఎంతో అద్భుతమైన పాత్రలు చేయాలని ఉంది. ఇంకా చాలా కాలం సినిమాల్లో గొప్ప పాత్రలు చేసి మళ్లీ సూపర్ స్టార్ గా మారాలని   అనుకుంటున్నాను. ప్రస్తుతం ఈ వయసులో కూడా అమితాబచ్చన్ స్టార్గా కొనసాగుతూ  ఉన్నారు. ఆయనే నాకు ఆదర్శం అంటూ శరత్ కుమార్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: