‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ ఈమూవీ మ్యానియాను రోజురోజుకు పెంచగలిగినప్పుడు మాత్రమే ఈమూవీకి ‘బాహుబలి’ రేంజ్ లో కలక్షన్స్ వస్తాయి. ఈమూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈమూవీ పై మ్యానియా జాతీయ స్థాయిలో ఏర్పడాలి.


ముఖ్యంగా ఈ మూవీ గురించి బాలీవుడ్ మీడియా ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువగా మాట్లాడుకోవాలి. అయితే ఇప్పటి వరకు ఈసినిమాకు సంబంధించి విడుదలైన టీజర్లు కానీ అదేవిధంగా ఆతరువాత విడుదల అయిన ‘దోస్తీ’ పాటగాని యూట్యూబ్ లో రికార్డులను క్రియేట్ చేయలేదు. కేవలం లేటెస్ట్ గా విడుదల అయిన ‘నాటు నాటు’ పాట మాత్రం యూట్యూబ్ లో సంచలనంగా మారింది.


అయితే యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ పాటకు ఉత్తరాదిన ఊహించినంత స్పందన రాలేదు అంటున్నారు. దీనికి కారణం ఉత్తరాది ప్రేక్షకులకు చరణ్ జూనియర్ ల పట్ల పెద్దగా మ్యానియా లేదు. దీనితో వ్యూహాత్మకంగా ఈమూవీ క్రేజ్ కోసం అజయ్ దేవగణ్ అలియా భట్ లు నటిస్తున్నప్పటికీ వారికి సంబంధించిన సన్నివేశాల ఎలివేషన్ కానీ పాట కానీ ఏమి లేకుండా కేవలం చరణ్ జూనియర్ లను ఎలివేట్ చేస్తూ ఇప్పటివరకు ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రచారం జరుగుతూ ఉండటంతో ఈమూవీకి ఇంకా మ్యానియా ఉత్తరాదిన ఏర్పడలేదా అన్న సందేహాలు వెలువడుతున్నాయి.


‘ఆర్ ఆర్ ఆర్’ బిజినెస్ 600 కోట్లకు పైగా జరగడంతో ఈ మూవీకి అత్యంత భారీ స్థాయిలో కలక్షన్స్ వచ్చి తీరాలి. దీపావళికి విడుదలైన ‘సూర్య వంశీ’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈమూవీకి ఇప్పటి వరకు 150 కోట్ల కలక్షన్స్ దాటలేదు అన్న వార్తలు వస్తున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళి ఆశిస్తున్న స్థాయిలో కలక్షన్స్ వస్తాయా అన్నదే సందేహం. రాజమౌళి ష్టామినాకు అదేవిధంగా చరణ్ జూనియర్ ల పాన్ ఇండియా ఇమేజ్ కి ‘ఆర్ ఆర్ ఆర్’ పెద్ద పరీక్షగా మారింది..  




మరింత సమాచారం తెలుసుకోండి: