రకుల్ ప్రీత్ సింగ్.. తన అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాలో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఢిల్లీ భామ. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ..ఇంకా హీరోయిన్ గా నెట్టుకొస్తుంది అంటే అమ్మడు అందం క్రేజ్ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. కన్నడ సినిమా గిల్లితో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత బోలెడు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ హిందీలో యారియాన్ అనే సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ తరువత తెలుగు,తమిళ,హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో ఈమె నటించిన మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ . ఈ సినిమాలో సందీప్ కిషన్ పక్కన రకుల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో ఆమె నటనకు మెచ్చి టాలీవుడ్ బడా డైరెక్టర్స్ ఆమెకు అవకాశాలు ఇచ్చారు. అమ్మడు లక్ బాగుండడంతో అన్నీ సినిమాలు హిట్ అవ్వడం..కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫిస్ దగ్గర ఈమె నటించిన సినిమాలు లాభాలు  తెచ్చిపెట్టడంతో..స్టార్ దర్శకులు,నిర్మాతల పాలిట రకుల్ అదృష్ట దేవతగా మారిపోయింది. ప్రస్తుతం బడా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న ఈమె..ఈ మధ్యనే తన లవర్ ను ప్రపంచానికి పరిచయం చేసింది.

 బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నానంటూ చెప్పి ఒక్కసారిగా అందరిని  ఆశ్చర్యపరిచింది రకుల్ ప్రీత్ సింగ్. దీంతో ఈ ఢిల్లీ చిన్నది తన బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనుందని అభిమానులు  భావించారు. కానీ రీసెంట్ గా అమ్మడు మాట్లాలు వింటే..ఈమె పెళ్లి ఇప్పట్లో లెనట్లే అని తెలుస్తుంది. రకుల్ నటించిన థ్యాంక్స్ గాడ్ చిత్ర ప్ర‌మోష‌న్స్‌తో భాగంగ ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడిన ఈమె.. త‌న పెళ్లికి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్  విష‌యాలను తెలియ‌జేసింది. రకుల్ మాట్లాడుతూ.."నా పర్సనల్ లైఫ్  సంబంధించిన దాని గురించి ఎందుకు బయటపెట్టానంటే..అది ఓ అందమైన విషయం కాబటి. ఆ విషయం నా అభిమానులతో పంచుకోవాలనుకున్నాను. అందుకే రివీల్ చేసా. కానీ పెళ్లి మాత్రం ఇప్పుడు చేసుకోను. దాని కి అంత తొందరలేదు. ఇంకా చాలా టైం ఉంది. ప్రస్తుతం నా దృష్టి అంతా నా కెరీర్‌పైనే మరేదాని పై లేదు. ఇప్ప‌టివరకు అయితే పెళ్లి చేసుకోవాల‌నే ఆలోచ‌నే నాకు లేదు"..అంటూ తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది రకుల్.  

మరింత సమాచారం తెలుసుకోండి: