సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ హీరోలు కానీ, దర్శకులు కానీ, సంగీత దర్శకులు కానీ, తన మొదటి సినిమాతో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని ఆశతోనే వస్తారు, కానీ కొంతమందికి మాత్రమే అది సాధ్యమవుతుంది, మరి కొంతమంది ఆ ప్రయత్నంలో విఫలమవుతారు, ఆ విధంగా స్థానాన్ని సంపాదించుకున్న కొంతమంది దర్శకులలో బోయపాటి శ్రీను కూడా ఒకరు రు. 1994లో డిగ్రీ పట్టా పొందిన వెంటనే  పోలీస్ అవ్వాలని టెస్ట్ లను కూడా పూర్తి చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అందులో చేరలేక పోయారు. తర్వాత ఫోటో వ్యాపారం  పత్రికలలో రచయితగా కొనసాగిస్తున్న సమయంలో, అప్పటికే సినిమాలో రచయితగా పని చేస్తున్నా పోసాని కృష్ణ మురళి శ్రీను దగ్గరి బంధువు కావడంతో ఆయన సిఫారసు మేరకు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గర శ్రీను అసిస్టెంట్ దర్శకుడిగా చేరారు. ఆయన దర్శకత్వంలో అన్నయ్య, గోకులంలో సీత వంటి చిత్రాలకు బోయపాటి శ్రీను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.

2003వ సంవత్సరంలో తను రాసుకున్న కథను అల్లు అర్జున్ హీరోగా తీయాలని, కథను వినిపించారు. ఈ కథ నచ్చినప్పటికీ వేరే ఇతర కారణాల వల్ల ఒప్పుకోలేదు. ఇక ఆ కథను దిల్ రాజు ఓకే చేశారు. బోయపాటి శీను దర్శకత్వంలో, రవితేజ హీరోగా, దిల్ రాజు నిర్మించిన  చిత్రం భద్ర.


రవితేజ, మీరాజాస్మిన్ నటీనటులుగా దర్శకుడు బోయపాటి శ్రీను  2004లో  తెరకెక్కించిన సినిమా భద్ర. ఈ సినిమా మా యాక్షన్- ఫ్యాక్షన్ డ్రామ గా తెరకెక్కింది.  తన స్నేహితుడి కుటుంబం పై జరిగిన హత్యలకు పగ తీర్చుకుంటూ, ఆపదలో ఉన్న ఒక అమ్మాయిని ఆదుకునే ఒక యువకుడి కథ. ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలో పరిచయమై మంచి విజయాన్ని సాధించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ సినిమా మా హీరో రవితేజ కు  కూడా మంచి పేరునగుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత దీనిని హిందీలో కూడా అనువదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: