ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు రీమేక్ సినిమాల గురించి కాస్త ఎక్కువగా చర్చలు జరుగుతున్న మాట వాస్తవం. రీమేక్ సినిమాల విషయంలో చాలా మంది అగ్రహీరోలు ఆసక్తికరంగా ఉన్న నేపథ్యంలో చాలామంది దర్శక నిర్మాతలు రీమేక్ సినిమాల వైపు ఆసక్తి చూపిస్తూ మంచి కథలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలుగులో సినిమాలు చేయడానికి రెడీ గా ఉంటున్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ కోసం చాలామంది దర్శక నిర్మాతలు రీమేక్ కథలను ఎంచుకుని ప్రయత్నం చేస్తున్నారు అనే మాట వాస్తవం.

ప్రస్తుతం రీమేక్ కథల విషయంలో కాస్త మెగా ఫ్యామిలీలో పెద్ద హీరోలు కూడా ఆసక్తి చూపించడం పట్ల నిర్మాతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తమిళం మలయాళం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన చిరంజీవి అలాగే రామ్చరణ్ రీమేక్ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఇతర భాషల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ రీమేక్ సినిమాలను చేస్తూ మంచి విజయాలు నమోదు చేశారు. చిరంజీవి ప్రస్తుతం రీమేక్ సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు అనే వార్తలు కూడా తెలుగు సినిమాలో ఎక్కువగా వినబడుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు సినిమాలలో చాలా వరకు కూడా అగ్రహీరోలు రీమేక్ కథలలో చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్న తరుణంలో చిరంజీవి వెంట వెంటనే కథలను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి మలయాళ రీమేక్ మీద దృష్టి పెట్టగా త్వరలోనే మరో రీమేక్ సినిమా మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక ప్రముఖ దర్శకుడు కథ సిద్ధం చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే తెలుగు కి తగిన విధంగా కథను మారుస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు ముందుకు రాబోతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: