అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'గా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన పూజతో చేసిన రొమాన్స్ అందరినీ ఆకర్షించింది. ఫలితంగా అఖిల్ తన కెరీర్లోనే ఈ సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తరువాత తన నెక్స్ట్ మూవీకి సిద్ధమయ్యాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏజెంట్'లో అఖిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ లో అఖిల్ అక్కినేనికి సంబంధించి నమ్మశక్యం కాని ఫిజికల్ మేక్ఓవర్ నుండి ఇప్పటి వరకు మేకర్స్ అక్కినేని అభిమానులకు ఈ సినిమా మాస్ ఫీస్ట్ అని వాగ్దానం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 డిసెంబర్ 24న థియేట్రికల్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే చాలా ఇతర సినిమాల మాదిరిగానే భయంకరమైన పరిస్థితులతో ఇది కూడా వెనుకబడిపోయింది. నిర్మాత అనిల్ సుంకర ఇప్పుడు ట్విట్టర్‌లో అభిమానులకు బూస్ట్-అప్ సందేశంతో భరోసా ఇచ్చారు.

కోవిడ్ కారణంగా సినిమా తేదీ మారిందని, అయితే వారి స్పిరిట్, స్పీడ్ నిరాటంకంగా ఉందని, అవుట్‌ పుట్ అద్భుతంగా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. ఏజెంట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతోంది. తెలుగు సినిమాలో మునుపెన్నడూ చూడని యాక్షన్ గ్లింప్స్ ఇస్తామని మేకర్స్ వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ యాక్షన్ మరియు స్టైల్‌తో కూడిన వరల్డ్‌ క్లాస్ స్పై సినిమాతో సమానంగా 'ఏజెంట్' ఉంటుందని అనిల్ సుంకర నొక్కిచెప్పారు. 'ఏజెంట్‌'లో నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. వచ్చే ఏడాది నుంచి ఇప్పుడు షూటింగ్‌ ప్రారంభం కానుంది.


"అక్కినేని అభిమానులందరికి నమస్కారం... కరోనా వలన మా ఏజెంట్ డేటు మారినా దర్జా మారదు, దూకుడు మారదు. ధీమా మారదు" అంటూ చిత్ర నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్ లో ట్వీట్ ద్వారా తెలియజేశారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: