సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో  కనిపించి దివి అనూహ్యంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అవకాశాన్ని దక్కించుకుంది, ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకున్న ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది బుల్లితెర  అభిమానులను సంపాదించుకుంది,  ఇలా బిగ్ బాస్ ద్వారా తెలుగునాట కావలసినంత క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కూడా  సినిమాలతో వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, తను నటించే ఏదో ఒక సినిమాలో దివి కి క్యారెక్టర్ ఇప్పిస్తాను అని ప్రకటించాడు, అయితే ఆ ప్రకటనకు తగినట్టుగానే చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో ఈ ముద్దుగుమ్మకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. 

బిగ్ బాస్  ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది,  సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో టచ్ లో ఉండే హాట్ బ్యూటీ దివి అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా దివి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ పూల డ్రెస్సు ను ధరించి ఉయ్యాల ఊగుతూ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, దివి పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు ఉయ్యాలైనా జంపాలైనా నాతో ఊగమనీ అంటూ రాసుకొచ్చింది, ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: