అల్లు అర్జున్ తొలిసారి ఊర మాస్ గెటప్ వేసి ప్రేక్షకులను అరిపిస్తున్నారట.. సుకుమార్ దర్శకత్వంలో ఆయన చేసిన 'పుష్ప' మూవీ తగ్గేదే లే.. అంటూ థియేటర్లలో హంగామా చేస్తూ దుమ్ము రేపుతోందనీ తెలుస్తుంది.

అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోందట.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో మరియు ఓవర్సీస్‌లో కూడా పుష్పరాజ్ హవా నడుస్తోందట.. బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుకుమార్ మీడియాతో మాట్లాడారట.. కొన్ని కొత్త విషయాలు రివీల్ చేసారనీ తెలుస్తుంది.. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి చెప్పుకొచ్చారట.. క్లైమాక్స్ లో ఫహాద్‌ ఫాజిల్ మరియు అల్లు అర్జున్ మధ్య సాగే పోర్షన్స్ గురించి చెప్పుకొచ్చారట..

అల్లు అర్జున్ మాట్లాడుతూ "నేను అనుకోవటం ఇద్దరు కంప్లీట్ న్యూడ్ గా ఆ సీన్ లో ఉండాలని. అలాగని పూర్తిగా న్యూడ్ గా చూపెట్టమనీ అయితే ఆ పీలింగ్ కలగచేస్తామనీ అయితే ఆ తర్వాత లాస్ట్ మినిట్ లో ఆ ఆలోచన విరమించుకున్నామని చెప్పుకొచ్చాడట. తెలుగు ఆడియన్స్ కు మరీ టూమచ్ అనిపిస్తుందని వద్దనుకున్నాము ,"అని చెప్పుకొచ్చారట.

కలెక్షన్స్ చూస్తే మొత్తంగా చూస్తే తొలివారం ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 67.24 కోట్ల షేర్ మరియు 101.65 కోట్ల గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్ చెబుతున్నాయట.. అదే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే112.25 కోట్ల షేర్ అలాగే 196 కోట్ల గ్రాస్ వసూలైందని తెలుస్తుంది.. మరో 33.75 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందని సమాచారం. ఇకపోతే యూఎస్ కలెక్షన్స్ పరంగా పుష్పరాజ్ భేష్ అనిపించుకుంటున్నారట.. ఈ వారం రోజుల్లో 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసి వసూళ్ల సునామీ సృష్టిస్తున్నారని తెలుస్తుంది.. బన్నీ కెరీర్‌లో ఈ అరుదైన ఫీట్ సాధించిన రెండో సినిమాగా 'పుష్ప' నిలవడం చెప్పుకోదగ్గ విషయమని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: