టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న గౌరవం గురించి  తెలిసిందే. సీనియర్ నటులలో ఆయన ఒకరు కానీ ఇప్పటికీ యంగ్ హీరోలతో ఆయన పోటీగా దూసుకెళ్తున్నాడు.ఇప్పటికీ తన నటనలో మరియు డాన్స్ లో ఎక్కడ కూడా ఎనర్జీని తగ్గించుకోలేదు చిరు. పైగా తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఈ వయసులో కూడా చిరంజీవి ఎనర్జీ గురించి చాలా మంది యంగ్ హీరోలు కూడా మాట్లాడుకున్నారు.గత రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. తను ఒక్కడే కాకుండా తన వారసులను కూడా ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేసాడు.ఒక నటుడుగా ఎంత మంచి హోదా సంపాదించుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంత కంటే ఎక్కువ గుర్తింపు అందుకున్నాడు.

వ్యక్తిగతంగా కూడా ఆయన ఎంతో మంది ప్రజలను అభిమానులుగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలా ఉంటుంది . సినీ ఇండస్ట్రీలో కూడా చిరంజీవికి నటుడుగా కంటే వ్యక్తిగతంగా మంచి గుర్తింపు ఉంది.. ఆయన ఎంతో మంది ప్రజలను అలాగే ఇండస్ట్రీకి చెందిన నటీనటులను ఆపద సమయంలో ఆదుకొని మంచి మనసున్న వ్యక్తిగా నిలిచాడు.ఇప్పటికే చిరంజీవి ఎంతో మంది ప్రజలకు ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. సొంతంగా బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేశాడు. కోవిడ్ సమయంలో కూడా వెనకాడలేదట చిరంజీవి. దీంతో చిరంజీవి గొప్పతనం చూసి ఎంతోమంది సినీ ప్రముఖులు టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవిని పెద్ద దిక్కుగా చూడాలని అనుకుంటున్నారట.కొందరు మాత్రం చిరంజీవికి ఆ హోదాను ఎప్పుడో ఇచ్చేశారు.

గతంలో రాజకీయ నాయకుడు వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలని అనుకున్నారట.. కానీ చిరంజీవి ఆ హోదాను వద్దనుకుంటున్నట్లు తాజా సమాచారం.. ప్రస్తుతం దాసరి నారాయణ ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్న అందరికి తెలిసిందే. కానీ ఈయన తర్వాత పెద్ద దిక్కు ఎవరు అని ప్రశ్నలు బాగా ఎదురయ్యాయట.ఇక దీంతో చిరంజీవి పేరు బాగా వినిపించిందని తెలుస్తుంది.. కొందరు మాత్రం చిరంజీవిని పెద్దదిక్కుగా చూడాలని అనుకోవడం లేదట ఎందుకంటే వారికి వ్యక్తి గతంగా కాస్త వ్యతిరేకత ఉండటం వల్ల చిరంజీవిని అస్సలు సపోర్ట్ చేయలేకపోతున్నారు.

ఇక తాజాగా చిరంజీవి కూడా టాలీవుడ్ పెద్దరికం గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. సినీ పరిశ్రమ పెద్ద గా తాను ఉండనని క్లారిటీగా ఇచ్చాడట. ఆ స్థానం తనకు వద్దని ఆ పంచాయితీలు చెయ్యనని తేల్చిచెప్పాడు. ఇక సినీ ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవటం తనకు ఇష్టం లేదని తన మనసులో మాటలను బయటకు చెప్పేసాడు . అంతే కాకుండా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మాత్రం అస్సలు ముందుకు రానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కానీ సినీ కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని క్లారిటీ ఇచ్చాడట. మొత్తానికి చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.. చాలామంది చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దదిక్కుగా చూడాలనుకున్నారు కానీ చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడంతో చాలామంది బాగా నిరాశ చెందుతున్నారు.

చిరంజీవి ఈ పెద్దరికాన్ని వద్దనడంతో బాగా చర్చలు జరుగుతున్నాయి. వార్తలలో కూడా ఈ విషయం  హాట్ టాపిక్ గా మారింది. మరి టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు ఉంటారని ప్రశ్నార్థకంగా మారిందట. ఇక కొందరు చిరంజీవి తీసుకున్న నిర్ణయం సరైనదని.. ఎందుకంటే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని ఈ సమయంలో పెద్దదిక్కుగా బాధ్యతలు తీసుకోవడం చాలా కష్టమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: