మలైకా అరోరా, అర్జున్ కపూర్ ల గురించి ఎవర్ని అడిగినా చెబుతారు. వారు బాలీవుడ్ హాట్ కపుల్ అని. అయితే వీరు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. కానీ అది ఎప్పుడు నిజమౌతుందో తెలియదు. ఈ ఇద్దరు ఎప్పుడు మీడియా ముందు కనబడినా హాట్ టాపిక్ గానే ఉంటుంది. మలైకా అరోరా, అర్జున్ కపూర్ ల మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగానే ఉంది.

మలైకా అరోరాకు ఇప్పటికే పెళ్లైంది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. భర్తతో కటీఫ్ చెప్పిన తర్వాత అర్జున్ కపూర్ కు దగ్గరైంది. ఇంకేముందీ వీళ్లిద్దరూ కొంతకాలంగా డీప్ లవ్ లో ఉన్నారు. తొందర్లోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మలైకా అరోరా, అర్జున్ కపూర్ లు మంచి చెడులు తెలిసినవారు. వారిద్దరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ వాటికి ఎదురొడ్డి నిలబడి.. తన ప్రేమ బంధాన్ని నిలబెట్టుకోవాలని తహతహలాడుతున్నారు. పెళ్లి బంధంతో మరింత దగ్గర కావాలని అనుకుంటున్నారు.

అర్జున్ కపూర్ చాలా సెన్సిటివ్ కాగా.. మలైకా అన్ని విషయాల్లో చాలా శ్రద్ధగా ఉండే వ్యక్తి అని తెలుస్తోంది. అర్జున్ కపూర్ సున్నితంగా ఉండటమే మలైకాకు బాగా నచ్చుతుందట. మరోవైపు ఈ ఇద్దరి వివాహం ఈ ఏడాదే జరుగుతుందని బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల క్రిస్ మస్, న్యూ ఇయర్ వేడుకలను చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఆ ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ మధ్యే మాల్దీవుల్లో చాలా ఎంజాయ్ చేశారు. ఆ బీచ్ లో కలియదిరిగారు. నచ్చిన ఫుడ్ ను ఇష్టంగా తింటూ నెటిజన్లను నోరూరించారు.

కానీ కొద్ది రోజుల పాటు.. వాళ్లు సరిగా కనిపించకపోవడంతో.. అనేక రకాల అనుమానాలు వచ్చాయి. ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిపోయిందని అంతా అనుకున్నారు. అలాంటిదేమీ కాదని నిరూపించే ప్రయత్నం చేశారు. అందుకు రుజువుగా ఫోటోలను కూడా షేర్ చేశారు. వచ్చే సంవత్సరమే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోందనే టాక్ వినిపిస్తోంది. నెటిజన్లు మాత్రం ఆ దృశ్యం కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు.












మరింత సమాచారం తెలుసుకోండి: