ఒకానొక సమయంలో సినిమాల్లో విలన్ గా నటించాలి అంటే ముంబై నుంచో లేక వేరే ప్రాంతం నుండి ప్రత్యేకంగా ఒక నటుడు ని తీసుకొచ్చి విలన్ పాత్రలు వేయించేవారు, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు చాలా వరకు తగ్గాయి.  టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా విలన్ పాత్రల కోసం ఇతర భాషలలో హీరోలుగా ఉన్నవారిని తీసుకొని వస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఆ హీరోలకు ఉన్న ఇమేజ్ మరియు వారికి ఉన్న స్టార్ డమ్ ఆ సినిమాకు ప్లస్ అవుతాయి అని ఆ చిత్ర దర్శక, నిర్మాతలు భావించడమే.  అలా ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాలలో పరాయి భాషలో హీరోలుగా చెలామణి అయ్యే వారిని తెలుగు లో విలన్ పాత్రలో చూపించారు.  అలా ఇతర భాషల్లో హీరోలుగా పాపులారిటీని పెంచుకుని తెలుగు భాషలో విలన్ లుగా నటించిన వారి గురించి మనం తెలుసుకుందాం.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో నాని హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన ఈగ సినిమాలు కన్నడ  స్టార్ హీరో కిచ్చ సుదీప్ విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

అల్లు అర్జున్ హీరోగా సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫేహాద్ ఫాసిల్ విలన్ పాత్రలో కనిపించాడు. పుష్ప మొదటి భాగంలో ఫేహాద్ ఫాసిల్ విలనిజం ఎక్కువగా లేకపోయినా రెండవ భాగంలో మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందని చిత్ర బృందం తెలియజేస్తోంది.

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు తన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో తమిళ్ లో హీరోగా ఫుల్ ఫామ్ లో ఉన్న విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు.

ఇలా వీరితో పాటు మరికొంత మంది కూడా ఇతర భాషల్లో హీరోలుగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని టాలీవుడ్ లో విలన్ పాత్రలను వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: