నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబో అంటే ఆ సినిమా పక్కా హిట్ అన్నట్టే. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో సిం హా, లెజెండ్ సినిమాలు రాగా ఈమధ్యనే ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా అఖండ వచ్చి అదిరిపోయే హిట్ అందుకుంది. బాలకృష్ణ, బోయపాటి బిబి3 కాంబో ప్రేక్షకులకు మంచి మాస్ ట్రీట్ ఇచ్చింది. అఖండ సక్సెస్ థ్యాంక్స్ మీట్ లో మీడియాలో ముచ్చటించారు చిత్రయూనిట్. ఈ క్రమంలో బోయపాటికి ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది.

బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా తీశారు. నిర్మాత రవీందర్ రెడ్డితో రెండు సినిమాలు తీశారు. ఇదే విధంగా మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తున్న ఈ టైం లో బాలయ్య, బోయపాటి, బన్నీ బిబిబి సినిమా ఉండే అవకాశం ఉందా అని అని అడిగారు. అందుకు ఆన్సర్ గా బోయపాటి ఏమో ఇది జరుగుతుంది ఇది జరగదు అని ఉండదు. ఏదైనా జరగొచ్చు. మిర్యాల రవీంద్ర రెడ్డితో 3వ సినిమా ఏంటి 30 సినిమాలైనా చేస్తా. బాలయ్య, బన్నీ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అంటే ఏమో ఉన్నా ఉండొచ్చు అలాంటి కథ వస్తే తప్పకుండా ఈ కాంబో తో సినిమా చేస్తానని అన్నారు బోయపాటి శ్రీను.

ఆల్రెడీ అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను సరైనోడు సినిమా చేశాడు. బన్నీకి ఫుల్ మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమాగా సరైనోడు సత్తా చాటింది. అసలైతే బన్నీతో బోయపాటి సినిమా ఒకటి డిస్కషన్ లో ఉంది. ఆ సినిమాలో చిన్నగా బాలయ్య కూడా ఉండేలా కథ మార్చి బాలయ్య, బన్నీ మల్టీస్టారర్ గా ఆ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్నది బోయపాటి ఆలోచిస్తే బెటర్ అని కోరుతున్నారు. బిబిబి కాంబో ఫిక్స్ అయితే మాత్రం అటు నందమూరి ఫ్యాన్స్.. ఇటు మెగా ఫ్యాన్స్ మరోసారి పండుగ చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: