ఇక బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక అందరు తమ లైఫ్ లో బిజీ అయిపోయారు. కొందరు సీరియల్స్ చేసుకుంటుంటే..కొందరు సినిమా అవకాశాలు అందుకుని ఆ సినిమా షూటింగ్ లల్లో బిజీ గా ఉన్నారు. కొందరు యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నారు.
అయితే తాజాగా ఈయనకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అది ఏమిటంటే..టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య సినిమాలో ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా నటిస్తున్నాడంటూ ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. డైనమిక్ డైరెక్టర్ గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో రాబోతున్న బాలయ్య సినిమాలో మానస్ అవకాశం అందుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కవేళ్ల ఇదే కనుక నిజమైతే మానస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఇదే అంటున్నారు ఆయన ఫ్యాన్స్.