వాస్తవానికి మిగతా రంగాలతో పోలిస్తే సినిమా రంగంలో ఒకింత సెంటిమెంట్స్ కి పెద్ద పీట వేస్తుంటారు సినిమా పెద్దలు, నటీనటులు. ఏదైనా రోజున చెడు లేదా మంచి జరిగినా ఎక్కువగా దానిని పరిగణలోకి తీసుకుని తమ సినిమాల రిలీజ్ లు వంటివి వారు ప్లాన్ చేస్తుండడం ఎన్నో సందర్భాల్లో చూసాము. అయితే మనం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, టాలీవుడ్ లో కూడా ఈ రకమైన సెంటిమెంట్స్ ఇటీవల మరింతగా పెరిగాయనే చెప్పాలి. అయితే విషయంలోకి వెళితే ఎక్కువగా టాలీవుడ్ ప్రముఖులు తమ సినిమాలని పెద్ద పండుగలైన దసరా, ఉగాది, సంక్రాంతి వంటి వాటి సమయంలో తమ మూవీస్ రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు.
ఇక ఏదైనా తేదీన రిలీజ్ అయిన సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొడితే తమ మూవీ కూడా అదే రోజున వస్తే ఒకవేళ సక్సెస్ అవుతుందేమో అనేది వారి నమ్మకం. ఇక ప్రస్తుతం మనం చెప్పుకోబోతోంది ఏప్రిల్ 28 డేట్ గురించి. ఈ స్పెషల్ డేట్ కి టాలీవుడ్ లో ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా సరిగ్గా 1955లో అక్కినేని నాగేశ్వర రావు, అంజలి నటించిన అనార్కలి తొలుత ఈ రోజున రిలీజ్ అయి అతి పెద్ద సక్సెస్ కొట్టింది. అనంతరం 1976లో మరొక్కసారి నాగేశ్వరావు నటించిన సెక్రటరీ సినిమా కూడా అదే రోజున విడుదలై సూపర్ గా సంచలన విజయం నమోదు చేసింది.

అలానే 1977లో నందమూరి తారకరామారావు నటించిన అడవిరాముడు, 1983లో కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ అడవి సింహాలు, 1994లో అలీతో ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల, 1995లో కమల్ హాసన్ నటించిన శుభసంకల్పం, ఇక 2006లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా పూరి జగన్నాథ్ తీసిన పోకిరి, ఇటీవల ప్రభాస్ తో దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన గొప్ప చిత్ర రాజం బాహుబలి 2 వంటి సినిమాలు సరిగ్గా ఇదే రోజున రిలీజ్ అయి గొప్ప సంచలనాలు నమోదు చేసాయి. అందుకే మరొక్కసారి తన లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ ని అదే రోజున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు రాజమౌళి. ఒకవేళ ప్రస్తుతం మన దేశంలో కరోనా పరిస్థితులు మెరుగై దేశవ్యాప్తంగా థియేటర్స్ తెరుచుకుంటే ఆర్ఆర్ఆర్ ని మార్చి 18న, లేదా అప్పటికి పరిస్థితులు సెట్ కాకపోతే ఆ తరువాత ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే సరిగ్గా అదే రోజున తన సినిమా రిలీజ్ చేసి మరొక పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని జక్కన్న చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: