సూపర్ స్టార్ మహేష్ బాబు  తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమా నిన్న అనగా మే 12 వ తేదీన చాలా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయిన విషయం  మన అందరికి తెలిసిందే.  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.  సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన సినిమా కావడం,  గీత గోవిందం సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో మహేష్ బాబు అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రముఖులు కూడా సర్కారు వారి పాట సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.  

ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. అలా ఎన్నో అంచనాల నడుమ నిన్న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మొదటి రోజు సర్కారు వారి పాట సినిమా కలెక్షన్లను కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. తమన్ సంగీతం కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను తను తెచ్చుకున్న సర్కారు వారి పాట సినిమా పై దర్శకుడు హరీష్ శంకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మ‌హేశ్ బాబు స్టయిలిష్‌ ప్ర‌ద‌ర్శ‌న, టైమింగ్ సూపర్ గా ఉన్నాయ‌ని హరీష్ శంకర్ చెప్పారు. ‘సర్కారు వారి పాట’ మూవీ చూస్తే గొప్ప అనుభూతిని పొంద‌వ‌చ్చ‌ని హరీష్ శంకర్ అన్నారు. దర్శకుడు పరుశురామ్ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్  వారు ఈ సారి దిష్టి తీయించుకోవాల‌ని హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: