నాచురల్ స్టార్ నాని తాజాగా అంటే సుందరానికి మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నజ్రియా కథానాయికగా నటించగా, వివేక్ ఆత్రేయ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదలకు ముందు చిత్ర బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్,  సాంగ్స్,  ట్రైలర్ లకు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ జూన్ 10 వ తేదీన విడుదల అయిన అంటే సుందరానికి మూవీ కి బాక్సాఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ లభించేది. సెకండ్ ఆఫ్ బాగానే ఉన్నప్పటికీ ఫస్టాఫ్ మాత్రం కాస్త స్లో అయ్యింది అనే కామెంట్లు ఈ సినిమాపై వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటి వరకు 6 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న అంటే సుందరానికి మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం 5.43 కోట్లు , సీడెడ్ : 1.13 కోట్లు , యూ ఎ : 1.33 కోట్లు , ఈస్ట్ : 93 లక్షలు , వెస్ట్ : 79 లక్షలు ,  గుంటూర్ : 86 లక్షలు , కృష్ణ : 83 లక్షలు , నెల్లూర్ : 57 లక్షలు
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో అంటే సుందరానికి మూవీ 6 రోజులలో 12.87 కోట్ల షేర్ , 20.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.30 కోట్లు .
ఓవర్ సీస్ లో : 4.80 కోట్లు .


అంటే సుందరానికి మూవీ 6 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 17.97 కోట్ల షేర్ ,  31.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: