టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన నితిన్ ప్రస్తుతం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా కెరీర్ లో మొట్ట మొదటి సారి నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో కలెక్టర్ పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై నితిన్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం ఇప్పటికే డిసైడ్ అవడంతో ఈ సినిమా ప్రమోషన్ లను తాజాగా మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ సినిమా నుండి చిత్ర బృందం తాజాగా 'రా రా రెడ్డి ఐ యామ్ రెడీ' అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ లో తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు ఆయన అంజలి నటించింది. ఈ సాంగ్ లో నితిన్ , అంజలి చేసిన డ్యాన్స్ సూపర్ గా ఉండగా , అంజలి అందచందాలు ఈ సాంగ్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఇది ఇలా ఉంటే 'రా రా రెడ్డి ఐ యామ్' రెడీ సాంగ్ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను  తెచ్చుకుంటుంది.  అందులో భాగంగా ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో  6.63 మిలియన్ వ్యూస్ ను , 94.7 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కు 24 గంటల్లో మంచి రెస్పాన్స్ దక్కింది అని చెప్పవచ్చు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని సమకూర్చగా , ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.  క్యాథరిన్ , కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: