మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ వున్న నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ,  కియారా అద్వాని ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉండగా , అంజలి , సునీల్ ఇతర కీలక పాత్రలో ఈ మూవీ లో కనిపించబోతున్నారు.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఈ మూవీ షూటింగ్  ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ వచ్చే మూడు నెలల్లో పూర్తి చేసే విధంగా చిత్ర బృందం ప్రణాళికలను వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా లీక్ అయిన కొన్ని ఫోటోలు , వీడియోలు ఈ సినిమాపై అంచనాలు పెంచడం మాత్రమే కాకుండా , రామ్ చరణ్ కూడా అదిరిపోయే లుక్ లో ఉండటంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం ఎప్పుడు విడుదల చేస్తుందా ...  అని మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను శంకర్ తన మునుపటి మూవీ లాలగానే భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ ను , యాక్షన్ సన్నివేశాలను అదిరిపోయే రేంజ్ లో శంకర్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు డిఫరెంట్ లుక్ లలో కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా , విలన్ గా రెండు పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా శంకర్ , రామ్ చరణ్ ను హీరోగా , విలన్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: