యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి, ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని, ప్రస్తుతం వరుస సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తూ, అలాగా టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ ని కొనసాగిస్తున్న  అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  

జబర్దస్త్ కామెడీ  షో తో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత అనేక టీవీ యాంకర్ గా వ్యవహరించింది. అలా యాంకర్ గా టాప్ స్థానానికి ఎదిగిన అనసూయ ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అందులో భాగంగా అనసూయ ఇప్పటికే అనేక రకాల అయిన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది . అనసూయ తన కెరియర్ లో సాఫ్ట్ కార్నర్ ఉన్న పాత్రలలో మాత్రమే కాకుండా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కూడా నటించింది .  కొన్ని రోజుల క్రితం విడుదల అయిన పాన్ ఇండియా మూవీ పుష్ప ద్వారా అనసూయ కూడా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. 

ఇలా టీవీ షో లతో, సినిమాలతో ఫుల్ బిజీ గా కెరీర్ ను కొనసాగిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా అనసూయ కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అనసూయ రెడ్ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని, అందుకు తగిన బ్లౌజ్ ని ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి: