బింబిసార సినిమాతో అల్టిమేట్ హిట్ కొట్టాడు నందమూరి కల్యాణ్ రామ్. విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, కేవలం 3 రోజులకే బ్రేక్ ఈవెన్ అయింది.ఇప్పుడు ఏకంగా ఈ సినిమా 50 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. ఇక బింబిసార సినిమాకు తాజా వసూళ్లలో మొత్తం 50 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే ఓ సినిమా ఇంత త్వరగా 50 కోట్ల క్లబ్ లోకి చేరడం అనేది అసలు ఇదే తొలిసారి.ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు స్టడీగా వసూళ్లు వస్తున్నాయి. ఎన్ని సినిమాలు బరిలో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఆక్యుపెన్సీ అయితే తగ్గలేదు. విడుదలై ఇప్పటికీ 10 రోజులైనప్పటికీ నిన్నటికి నిన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఏకంగా కోటిన్నరకు పైగా షేర్ వచ్చిందంటే, ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతలా ఇష్టపడ్డారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.


ఇక అలా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కూడా.మొత్తం 40 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి, కల్యాణ్ రామ్ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించుకుంది బింబిసార సినిమా.ఇంకా వరల్డ్ వైడ్ గ్రాస్ మొత్తం చూసుకుంటే, ఈ సినిమా టోటల్ గా 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరినట్టయింది.ఇక రిలీజైన ఈ 10 రోజుల్లో నైజాంలో ఈ సినిమా రెట్టింపు లాభాలు అందించింది. మొత్తం 4 కోట్లు పెట్టి సినిమా కొంటే, ఇప్పటికి ఈ సినిమాకి 9 కోట్ల 30 లక్షల రూపాయలొచ్చాయి. అటు సీడెడ్ ఇంకా ఉత్తరాంధ్రలో కూడా దాదాపు రెట్టింపు లాభాలు ఆర్జించి పెట్టింది ఈ సినిమా.ఇక ఈ సినిమాతో కల్యాణ్ రామ్ మార్కెట్ అమాంతం పెరిగింది. అసలు 15 కోట్ల మార్కెట్ కూడా లేని కళ్యాణ్ రామ్ కు బింబిసార సినిమా ఏకంగా 50 కోట్ల మార్కెట్ ని తెచ్చిపెట్టింది.ఇక పై కళ్యాణ్ సినిమాలు భారీగా బిజినెస్ చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: