తమిళంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో పొన్నియిన్ సెల్వన్ సినిమా కూడా ఒకటనే విషయం తెలిసిందే. మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు.


ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుందట.. పొన్నియిన్ సెల్వన్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తుంది.. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో 5000కు పైగా ప్రజలు కనిపిస్తారని సమాచారం అందుతోంది.


ఆ సన్నివేశం ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. తమిళ బాహుబలిగా తెరకెక్కుతున్న ఈ సినిమా విక్రమ్ కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమాపై తమిళ ఇండస్ట్రీ చాలా ఆశలు పెట్టుకుంది. మరోవైపు మణిరత్నంకు సైతం ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ అయితే లేదు. తమిళంలో ఈ సినిమా విజయం సాధిస్తే మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల దిశగా అడుగులు పడే అవకాశం ఉంది.


 


తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందట.మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించడం విశేషం. దసరా పండుగ సమయంలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కూడా పెద్దగా పోటీ లేకపోవడం గమనార్హం.


 


గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు విడుదలయ్యే వరకు పొన్నియిన్ సెల్వన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ లేదనే విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు తమిళ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: