మొదట సీరియల్ ద్వారా తన కెరియర్ ను ప్రారంభించిన నటి హిమజ అటు తరువాత శతమానంభవతి, ధ్రువ, వినయ విధేయత రామ, మహానుభావుడు తదితర సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ఇక తర్వాత బిగ్ బాస్-3 లో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. రెండు నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను బాగా అలరించింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలలో బిజీగా మారిపోయింది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటుంది ఈమె. ఇక ఈమె పేరు మీద యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టింది.

ఇందులో ఆమె బ్యూటీ టిప్స్ సంబంధించి , హోమ్ టూర్ వీడియోలను కూడా షేర్ చేయడమే కాకుండా తెలుగు పండుగలకు సంబంధించి వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా హిమాజా ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా సమాచారం.. అందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే హిమజ ఇంట్లో దొంగతనం జరిగిందని ఆ దొంగ దొరికినట్లుగా ఈ వీడియోలో చూపించడం జరిగింది. అంతేకాకుండా అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా కేవలం ఆ దొంగ పైన జాలితో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది.

ఇక దొంగతనం చేయడానికి వచ్చిన ఆ దొంగ తన తప్పని తెలుసుకొని క్షమించమని కోరాడు. ఈ విషయంపై హిమజ అభిమానులలో అవేర్నెస్ కలిగించేలా ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పు కాదు.. సీసీటీవీ కెమెరా ఉంటే సెక్యూరిటీ కన్న బాగా పనిచేస్తుంది అంటూ హిమజ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం హిమజాకు సంబంధించి ఈ విషయం మాత్రం చాలా వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా హిమజ దొంగతనం వారి నుంచి తప్పించుకుందని చెప్పవచ్చు ఇక ఈమె షేర్ చేసిన అవేర్నెస్ వీడియోకు నెటిజన్ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: