ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . హీరోయిన్ గా నటించిన మొట్ట మొదటి మూవీ తోనే కృతి శెట్టి అద్భుతమైన విజయాన్ని మరియు అంతకు మించిన క్రేజ్ ని సంపాదించుకుంది . ఉప్పెన మూవీ తర్వాత కృతి శెట్టి వరుసగా శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీ లతో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది . 

ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా మూడు విజయాలను అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ది వారియర్ , మాచర్ల నియోజకవర్గం మూవీ లతో వరుసగా రెండు అపజయాలను కూడా ఎదుర్కొంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రేపు అనగా సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. 

మూవీ తో కృతి శెట్టి ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే వరస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న కృతి శెట్టి సోషల్ మీడియాలో కూడా ఆదే రేంజ్ లో సమయాన్ని గడుపుతూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో సారీ కట్టుకొని ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కృతి శెట్టి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: