పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల అయిన భీమ్లా నాయక్ మూవీ తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా మరో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్, 'భీమ్లా నాయక్' మూవీ  తో పాటే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే మూవీ ని కూడా ప్రారంభించాడు. కాక పోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ కొంత కాలం ఆగి పోయింది. కొంత కాలం పాటు ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే తిరిగి మళ్ళీ ప్రారంభం అయ్యింది. తర్వాత కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ మూవీ షూటింగ్ కొంత కాలం నుండి మళ్ళీ ఆగిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల అనగా అక్టోబర్ రెండవ వారం నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ మళ్లీ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన అందాల ముద్దు గుమ్మ నిది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు . ఈ మూవీ ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుండి చిత్ర బృందం పవర్ గ్లాన్స్ పేరుతో ఒక చిన్న వీడియోని విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: