కొంతమంది దర్శకుల కు ఎలాంటి అదృష్టం కలుగుతుంది అంటే వారు కెరియర్ ప్రారంభం లోనే ఒక పెద్ద హీరో తో సినిమా చేసే అవకాశాన్ని అందుకుంటూ ఉంటా రు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ సినిమా కు దర్శకత్వం వహించే అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని పొందాడు దర్శకుడు సాగర్ చంద్ర. భీమ్లా నాయక్ అనే సినిమాతో పవన్ కళ్యాణ్ ను డైరె క్ట్ చేసే అవకాశం అందుకున్న సాగర్ చంద్ర ఆ సినిమా విజయం అందుకోవడంతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.

పవన్ కళ్యాణ్ మెప్పును పొందిన ఈ దర్శకుడు తన టేకింగ్ విషయంలో సరికొత్త విధానాన్ని చూపిస్తూ ప్రేక్షకులను కూడా ఫిదా చేశాడు. కథ విషయంలో కొంత త డపడ్డా కూడా కథనం అలాగే టేకింగ్ విషయంలో ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాడు. ఆ విధంగా తప్పకుండా సాగర్ చంద్ర ఒక మంచి దర్శకుడు అవుతాడు అని ప్రతి ఒక్కరు కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే చాలా రోజులుగా ఈ దర్శకుడు చేయబోయే తదుపరి సినిమా యొక్క వివరాల గురించి కొంతమంది అభిమానులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. 

అయితే సాగర్ చంద్ర తదుపరి సినిమా ను ఇంకా ప్రకటించకపోవడం నిజంగా వారిలో నిరాశను కలిగిస్తుంది. మొదట దాకా వరుణ్ తేజ హీరోగా ఓ సినిమాను చేయబోతున్నాడు అని వార్తలు వినిపించాయి. ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని కథను విన్న వరుణ్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని దానికి సంబంధించి న స్క్రీన్ ప్లే చేయాలని సూచించాడని వార్తలు వినిపించాయి కానీ అది ఇంతవరకు ముందుకు వెళ్ళకపోగా తాజాగా వరుణ్ మరొక సినిమాను మొదలుపెట్టడంతో వరుణ్ సినిమా సాగర్ చేస్తున్నాడా లేదా అన్న అనుమానాలను కలిగిస్తున్నాయి. తొందరగా ఈ దర్శకుడు తన చేయబోయే తదుపరి సినిమా యొక్క వివరాలు వెల్లడించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: