మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అదిరి పోయే బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించిన చిరంజీవి ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ మలయాళం లో మంచి విజయం సాధించిన లూసిఫర్ అనే మూవీ కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించగా ,  సత్య దేవ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు  లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.

ఇది ఎలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే...  గాడ్ ఫాదర్ మూవీ కి 60 కోట్ల నాన్ ట్రియేటికల్ బిజినెస్ జరిగినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆచార్య లాంటి భారీ ఫ్లాప్ తర్వాత చిరంజీవి నటించిన మూవీ కి ఈ రేంజ్ లో నాన్ ట్రియేటికెల్ బిజినెస్ జరగడం అనేది మెగాస్టార్ చిరంజీవి స్టార్ స్టామినా వల్లే జరిగింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: