టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దసరా సీజన్ కొంత చప్పగా సాగిందని చెప్పాలి. ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు సినిమాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు రాబోతున్న దీపావళి సీజన్ అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందా అన్న అనుమానాలను కొంతమంది సినిమా విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు అక్కినేని నాగార్జున నటించిన రెండు సినిమాలు దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చాయి.

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదని చెప్పాలి. గాడ్ ఫాద ర్ సినిమా పర్వాలేదు అనిపించుకున్న గోస్ట్ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఏకంగా మూడు సినిమాలు దీపావళి కానుక గా ప్రేక్షకులు ముందుకు రాబోతూ ఉండడం విశేషం. వీటిలో రెండు సినిమాలు కూడా తమిళ సినిమాలే. రెండు తమిళ సినిమాల మధ్య అక్కడ తమిళం తో పాటు తెలుగులో కూడా ఇప్పుడు భారీ స్థాయిలో పోటీ నెలకొంది. 

అవి అన్నీ కూడా యాక్షన్ భరితమైన సినిమాలే కావడం సినిమా పట్ల అందరిలో ఆసక్తి అయితే ఉంది.  వాటిలో  పెద్ద హీ రోల సినిమాలు కూడా ఉన్నాయి. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ప్రిన్స్ సినిమా 21వ తేదీన విడుదల కాబోతుంది. తెలుగు దర్శకుడు అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తున్నాడు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఆ తరువాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమా కూడా అప్పుడే విడుదల అవ్వబోతుంది. ఇక మంచి విష్ణు నటించిన జిన్నా కార్తీ నటించిన సర్దార్ సినిమాలు కూడా 21వ తేదీన విడుదల కాబోతూ ఉండడం దీపావళి ప్రేక్షకులకు మంచి ధమాకా సినిమాలను అందిస్తుంది అని చెప్పాలి. మరి ఈ సినిమాలన్నీ కూడా మంచి క్రేజ్ కలిగి ఉన్న నేపథ్యంలో ఏ స్థాయిలో ఇవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: