మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మలయాళం లో అద్భుతమైన విజయం సాధించిన లూసిఫర్ అనే మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. గాడ్ ఫాదర్ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా , సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రామిసింగ్ నటుడి గా పేరు తెచ్చుకున్న సత్య దేవ్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన మంచి అంచనాల నడుమ తెలుగు మరియు హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది.  ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ లభించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటికే గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఇలా ఇప్పటికే తెలుగు మరియు హిందీ  ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తున్న గాడ్ ఫాదర్ మూవీ మరి కొన్ని రోజుల్లోనే తమిళ ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. గాడ్ ఫాదర్ మూవీ తమిళ్ లో అక్టోబర్ 16 వ తేదీన విడుదల కాబోతోంది. మరి ఇప్పటికే తెలుగు మరియు హిందీ ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ తమిళ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: