తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ లు ఎక్కువగా గ్లామర్ షో చేయడం పైనే పూర్తి దృష్టి పడుతున్నారు. అలాంటి పాత్ర ఒప్పుకుంటు తమ కెరీర్ ను ప్రమాదం లో పడవేసుకుంటున్నారు. ఇప్పుడు మేకర్స్ చేస్తున్న సినిమాలలో అలాంటి పాత్రలే ఎక్కువగా అవకాశాలుగా వస్తున్న నేపథ్యంలో వారి ఒప్పుకోక తప్పడం లేదు. అయితే కొన్ని కొన్ని సార్లు మన హీరోయిన్లు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కూడా చేయడం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

ఆ విధంగా ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో అలాంటి పాత్రలు చేసే హీరోయిన్లు చాలా తక్కువగా ఉన్నారని చెప్పాలి. అలాంటి వారిలో ఒకరు కీర్తి సురేష్ ఒకరు. ఆమె తొలి సినిమా నుంచి తన పాత్రల పట్ల ఎంతో వైవిధ్యత ఉండే విధంగానే చూసుకుంటూ వచ్చింది. అందుకే మహానటి అనే సినిమాను చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆలరించింది. ఆ సినిమా తో అవార్డు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అంతటి సక్సెస్ను కంటిన్యూ చేయలేక పోయిందని చెప్పాలి.  తమిళంలోనూ ఆమె పలు సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోగా అక్కడ కూడా ఆమె ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పాలి.

ఇప్పుడు ఆమె ఒక మంచి పాత్ర తో ప్రేక్షకులను ఆదరించడానికి సిద్ధమవుతుంది. ఈ పాత్ర డీ గ్లామర్ గా ఉండడం ఆమెకు మరింత ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పాత్ర ఆమె డీ గ్లామర్ గా చూపించడంతో అందరిలో ఎంతో ఆసక్తి పెరిగింది అని చెప్పాలి. సినిమాలోని పాత్రలన్నీ కూడా అలాగే కనిపిస్తూ ఉండడంతో ఈమె పాత్ర కూడా చాలా బాగా ఉంటుంది అని కొంతమంది చెబుతున్నారు. ఇక శ్రీకాంత్ వదిన దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాను వచ్చేయడాది విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తమిళ సంగీత సంచలనం సంతోష్ నారాయణ్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: