బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితం బ్రహ్మాస్త్ర అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. మొత్తం ఈ మూవీ మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం బ్రహ్మాస్త్ర : శివ కొన్ని రోజుల క్రితమే ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ మూవీ ని దర్శక ధీరుడు రాజమౌళి సమర్పించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ హిందీ తో పాటు తెలుగు లో కూడా భారీ విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే బ్రహ్మాస్త్ర రెండవ భాగం బ్రహ్మాస్త్ర : దేవ్ అనే పేరుతో విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే బ్రహ్మాస్త్ర రెండవ భాగంలో దేవ్ పాత్రలో పలానా హీరో నటించబోతున్నాడు అని ఇప్పటికే అనేక మంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు మూవీ యూనిట్ విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బ్రహ్మాస్త్ర రెండవ భాగంలో దేవ్ పాత్రలో నటించబోయేది ఈ హీరో అంటూ మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది.  బ్రహ్మాస్త్ర రెండవ భాగం దేవ్ లో దేవ్ పాత్రలో రెబెల్ స్టార్ ప్రభాస్ కనిపించపోతున్నాడు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ వార్తకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే బ్రహ్మాస్ర మొదటి భాగం శివ లో రన్బీర్ కపూర్ హీరోగా నటించగా , ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. బిగ్ బి అమితాబచ్చన్ ,  నాగార్జున ,  మౌని రాయి ఈ మూవీ లో ఇతర ముఖ్యపాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: